Sunday, July 31, 2011

ఓబుల్ రెడ్డి అంతర్మదనం..ఎందుకిలా జరిగింది....?“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమికులే కానవసరం లేదు.. స్నేహితులూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మనసారా మాటల్లో చెప్పాలన్నా “ఇష్టం” అనే పదం అపార్థాలకు తావిస్తుందేమోనని గుంజాటంలో చిక్కుకునే దుస్థితి మనది. నేస్తం తన స్నేహహస్తంతో హృదయాన్ని తడిమినప్పుడు “నువ్వంటే ప్రాణం మిత్రమా” అని మనసు ఒద్దికగా ఒదిగిపోతూ మూలగకపోతే మనలో స్పందనలు ఏమున్నట్లు? నిష్కల్మషమైన ఆ ప్రేమకు కూడా ఆద్యంతాలు, తర్కాలు అన్వేషించనారంభిస్తే మనలో మానవత ఎంత అడుగంటిపోయినట్లు..?

“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే... హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.

నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా... ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం...ఒకప్పుడు అలాపలికిన పెదాలే..ఇప్పుడు ఘోరమైన పదాలు పలికేందుకు సైతం వెనుకాడటంలేదు..కారనం ఎదైనకావచ్చు కనీసం అర్దం చేసుకోలేని మనస్సు లేనప్పుడు ఆ పదాలు పలికే అర్హత కోల్పోతారు మనం నుంచి నేను అనే స్వార్దం..నీలో ప్రవేశించినప్పుడు...ఎదుటి వాడు భాదపడతాడు అని తెల్సినప్పుడు కూడా స్వార్దంతో నీవు పలికే ప్రతీక్షరం ఎదుటి వాని .( ఒకప్పుడు నీకు ప్రత్యేక మైన స్నేహం ఇప్పుడు కాదన్న నీపెదాల్లో నిజాయితీ ఎప్పుడు పలుకుతావు )మనస్సు గాయపరస్తున్నాను అనీ అయినా నీవు ఆలోచించగలిగావా..?...నీ మనస్సాక్షిని ఒప్పించే చేస్తున్నావా.].? తెలీక చేస్తున్నావా తెలిసి చేస్తున్నావా ఎంత తలలు పగుల కొట్టుకున్నా అర్దకావడంలేదు మిత్రమా అంత తీరిక నీకెక్కడిదిలే..నీవరకు నీవు హేపీగా ఉంటే చాలుకదా అనే నీవు అలోచిస్తావు..నా చిన్నిమనస్సు కూడా నీవు హేపీగా ఉండాలనే కోరుకుంటుంది అని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే చాలు అదెలాగూ నీవు చేయవులే...దేవుడంటే నమ్మని నీవు దేవుని గుడీ సాక్షిగా నీవు చెప్పిన ప్రేమ నిర్వచనం నాగుండేల్లో ఇప్పటికీ బాంబులా పేలుతూనే ఉంది...ప్రేమ అనే పదాన్ని అలా ఎవ్వరితోనైనా అంటా దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా అని...ఆ మాట నిజంగా ఎలా అనగలిగావు...నిన్ను ఇష్టపడ్డ నన్ను ఎదురుగా పెట్టుకొని నాకెవ్వరూ లేరు అంటు మరో వ్యక్తి పేరు చెబితే ఎదుటి మనస్సు ఎంత ఆందోళన పడుతుంది అని ఆలోచించావా...నీకు నేను లేనా అని నిలదీయాలని పించింది..అప్పటికే అనాల్సినవన్నీ అనేశావు సో అక్కడ నేను అనటానికి చెప్పుకోవడానికి ఏంలేదు అందుకే మౌనంగా ఆకాశంవైపు చూస్తూ ఉండిపోయా..అంతకు మించి ఏమీ చేయలేక..

అంత దగ్గరగా ఉన్నమనం ఇప్పుడు దూరం అయ్యాము మళ్ళీ దగ్గరగా కాలేనంతగా...కారనాలు ఎన్నైనా ఉండొచ్చు..ఒకసారి మనసులో ఇష్టపడ్డతరువాత అన్నిటినీ జయించాల ...ఎన్నోకష్టాలు వస్తాయి ఓర్చుకోవాలి...రాతల్లో ఎంతోదైర్యిం ఉన్నదానిలా రాస్తావు నీ రియల్ లైఫ్ లొ ఎందుకు పిరికిదానిలా ప్రవర్తిస్తున్నావో అర్దంకాదు...నీవు ఆలోచనలు కరెక్టని నేను గట్టిగా నమ్ముతా..కాని నీవు ఆలోచించడం లో మామూలు ఆడపిల్ల కంటే దారుణం భయపడుతున్నావని తెలుస్తోంది ...నీలో దైర్యాన్ని చూసే అదే నీ ప్రత్యేకత అని ఒకప్పుడు అనుకునేవాన్ని ఇప్పుడు..దానిలో నిజం లేదని అనిపిస్తోంది...నీఎదురుగా ఏడుస్తే అదినిజం అని నమ్ముతావా....నిన్ను బాగా ఇంప్రస్ చేసేలా మాట్లాడితే అదే నిజం అని నమ్ముతున్నావు...నాకవి చాతకాదు.. మనసులో నాకు నీమీద చెప్పుకోలేనంత ఇష్టం వుంది అది నీకు తెల్సు కాని...నీ ఎదురుగా నటించాలి అది నాకు చేతకాదు..అందుకే నేను దూరం అయ్యాను అనుకుంటున్నా...నాగురించి నీకు తెల్సినంతగా ఎవ్వరికీ తెలీ అలాంటి నీవు ఎవ్వరో నామీద చెబితే నమ్మి నామీదకే దాడికి వచ్చావు అనకూడని మాటలు అన్నావు అయినా నేను మౌనంగా పడ్డాను అన్నది నీవేకదా అని మనసును సర్ది చెప్పుకున్నా...ఒక్కసారి గుండెల మీద చేయివేసుకోని చెప్పు నేనేంటో నీకు తెలీదా ఎందుకలా చేశావని ఎన్నోసార్లు అడగాలనుకొని నీవు ఎక్కడ భాదపడతావని అడగ లేకపోయా..వాడి సంగతి తెల్సి నీవు వాడికి సపొర్టు చేసి ఎంత తప్పుచేశావో ఇప్పటికైన అర్దం అయిందో లేదో...నిన్ను ఇష్టపడ్డందుకు వాడు చేసిన దానికి నిన్ని రకాలుగా నేను బ్లైం అయ్యానో తెలుసా..ఎంత టార్చర్ అనుభవించానో నీకు తెలీదు..తెల్సి ఉండొచ్చు కాని తెలీనట్టు ఉంటున్నావో కూడా తెలీదు ...నేను నిన్ను ఇష్టపడి తప్పు చేశానా నీవు నన్ను ఇష్టపడీ తప్పు చేశావా అన్నది నాకు ఇప్పటికీ అర్దం కాదు...ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నప్పుడు స్నేహంగా ఉన్నప్పుడు..ప్రేమించుకున్నప్పుడు లేని రీజన్స్ ఇప్పుడెందుకొచ్చాయో అర్దంకావడంలేదు..అలా వస్తాయని కూడా తెలీదు..దూరం చేసుకోవడాని రీజన్స్ ను అడ్డూగోడలు గా పెట్టీ దూరాం అవుతున్నావని పిస్తోందొ

Thursday, June 23, 2011

మొత్తానికి "ఓబుల్ రెడ్డిని ఓడించి" నీవే గెలిచావురా..?
మొత్తానికి "ఓబుల్ రెడ్డిని ఓడించి" నీవే గెలిచావురా..?

నీ ప్రేమ మీద నీకు నమ్మకంలేదు..
నీ స్నేహం మీద నీకు నమ్మకం లేదు..
నీ బందం మీద నీకు నమ్మకం లేదు..
మరి ఇన్ని అనుమానాలున్న నీవు ఏంచేయాలి...
ఎలాగోలా ఎదుటి మనిషిని దెబ్బతీయాలి..
అందుకే నా స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని డ్రామాలాడావు..
మగాడి వై ఉండి ఆడదానిలా ఏడుస్తూ అనుకున్నది సాదించావు
అందుకే నన్ను బకరాను చేశావు.....
నేను నిన్ను నమ్మానురా ..
నీవు హేపీగా ఉడాలనే కదురా నేను కోరింది మరి నీవేం చేసావు..
మానసికంగా దెబ్బతీశావు..జీవితం మీద దెబ్బకొట్టావు..
నీ స్వార్దం కోసం ఏన్ని డ్రామాలాడావురా..అందరిలా నేను నమ్మా..
నీవు బాగుండాలని కోరుకున్న నన్నే జీవితంలో కోలుకోలేని దెబ్బ తీశావు..
జీవితంలో ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ గురి చూడీ కోట్టావు..
నీవనుకున్నది సాదించావు..తిరుగులేని విజయం హేపీగా ఉన్నావు..
నీక్కావలసింది దొరుకుతుందీ....
నీవల్ల ఎదుటివాడు జీవితం నాశనం అయిందని ఒక్కసారన్నా ఆలోచించావా..
అసలు నీవు మనీషివి అయితే కదా మానవీయ విలువకు తెలిస్తేకదా..
అప్పుడు నీవుకొట్టిన దెబ్బకు ఇంకా నేను విల విల లాడుతునే ఉన్నా..
నీవు మాత్రం హేపీగా అమాయకుడిలా నీకు కావల్సింది దక్కించుకొంటూ నటిస్తున్నావు
అప్పుడు నీవు చేసిన దానికి ఎప్పుడు ఎక్షనాన ఊపితి ఆగిపోతుందో నన్నట్టున్నా..
ఏదోరోజు ఏదో ఘడియలో నా ఊపిరి పోతుంది ...దానికి కారణం మాత్రం నీవే..
ఇలా నమ్మకంగా నీవు ఓ మనిషి జీవితంతో ఆడుకొని ఏంచేస్తావురా..
నీవు నీ ఫ్యామిలీ మొత్తం నాలాగే భాదను అనుభవించినప్పుడు తెలుస్తుంది ..
ఓ మనిషి ప్రాణం పోవడానికి కారనం అవుతున్న నీవు..బాగుపడతావురా...?
నీవు పెట్టిన చిచ్చుకు నేను ఏ క్షనానైనా అనంత లోకాల్లో కల్సిపోవచ్చు..BYEE

Tuesday, June 21, 2011

అందరూ ఎందుకు నాలా ఆలోచిస్తున్నారు....?

అందరూ ఎందుకు నాలా ఆలోచిస్తున్నారు..
నేనిలా అంటున్నాను అంటే రీజన్ ఉంది..మరి అందరికి..
ఓ విషయంలో గెలవలేనంతగా ఓడిపోయా కాబట్టి తప్పదు
నా నిర్నయం నేను తీసుకోని పోదామంటే ఇదేంటి ఇలా జరుగుతుంది...
ఎందో గుండె దైర్యం ఉన్న వారు కూడా ఇలా డీలా పడీపోవడం ఆచ్చర్యం వేసింది..
నేను ఎందుకు సహాయం చేయలేకపోయా అని భాద వేసింది..
... ఆవకాశం ఉండీ నేనెందుకు సహాయం చేయలేక పోయాను...?
....కోచెం సమయం ఇచ్చి ఉంటే ..ముందుగా చెప్పి ఉంటే బాగుండేది
... నిజమే ఎదైనా అనుభవిస్తున్నా వారికే ఆ భాదవిలువ తెలుస్తుంది...
స్నేహితుల మై ఉండీ ఆమెకు ఆ ఆలోచన రాకుండా చేయలేకపోయా0 ..?
నిజమే డబ్బు చాలా నీచం అయింది ఎంతటి మనిషిని అయినా కుంగదీస్తుంది

Thursday, June 16, 2011

ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ కు త్వరలో ముగింపు పెట్టాలని నిర్నయించుకున్నా..

నేనేవ్వరు నాకే తెలియదు ....దేనికి ఎదురు లేదనుకొని ....అడవిలో తిరుగుతున్న సింహంలా..అమ్మాయిలంటే కాస్తదూరంగా నే ఉండేవాన్ని...ఎందుకంటే అమ్మాయిలతో మాట్లాడాలంటే టాలెంట్ టైం ఉండాలి అవి లేవని నమ్ముతాను అలా జీవితంలో ఓ ఉప్పెనలా ఓ అందమైన అమ్మాయి పరిచయం..కలా నిజమానుకునేలోపు ...ఆ పరిచయం ప్రాణంగా మారింది..అందమైన ఆమెమాటలు..ప్రతినిమిషం ఆమె ఆలోచనలు...ప్రతిక్షనం ఎక్కడ ఉండి ఏమిచేస్తుంది అనే ఆలోచనలే....ఎప్పుడు ఫోను చేస్తుందా...ఎప్పుడు SMS వాస్తుందాని ఎదురు చూడటమే జీవితంలో ఓ భాగం అయిపోయింది...తను కూడా నాలాగా నాగురించి ఆలోచిస్తుంది అని తెల్సి..ప్రపంచంలో నా అంత అదృష్ట వంతుడు లేడని అనుకునే వాడిని కారనం ఆమె పరిచయం అంత ఆనందాన్ని నింపింది జీవితంలో...ప్రతినిమిషం మాటల ప్రవాహం అలా సాగుతుండేది...ఎప్పుడన్నా మాట్లాడటం కుదరక పోతే ఏదో వెలితిగా దిగాలుగా ఉండేది...తన మాటల్లో తాను ఇలాగే ఫీల్ అవుతాను నీగురించి అని చెప్పినప్పుడు..చెప్పలేనతం ఆనందం ...తట్టుకోలేనంత సంతోషం తనకు ఉన్న స్నేహితుల్లో నేనో ప్రత్యేకమైన స్నహం అని చెప్పినప్పుడు ఆరోజంతా నిదురపోలేదు....తన లైఫ్ లో అంత గుర్తింపు ఇవ్వడాన్ని అంతగా ఫ్ల్ అయ్యాను..ఎందుకంటే తాను చాలా అందంగా ఉంటుంది...అమె అంతంతో పోలిస్తే నేను దేనికి పనికి రాను అంత అద్బుత మైన అందం తనది...నాతో మాట్లాడటమే గొప్ప అనుకుంటుంటే తన జీవితంలో తనకు ఎంతో ప్రాధాన్యిత ఇవ్వడం అదో గొప్ప అనుభూతి...ఒక్కోసారి అనిపించేది ఈ ఆనందాన్ని గుండెతట్టుకోగలదా ..ఆగిపోతుందేమో అన్న అందోళన..తను నాకు దూరం అయితే... అన్న ఆలోచన ఎందో భాద అనిపించేది...తను కల్సినప్పుడు ఎక్కడా చిన్న తేడా ఉండేది కాదు అంత ఇష్టంగా ఉండేది...అమెమాటలు ఇప్పుడు కూడా ఇంకా నాతో మాట్లాడు తున్నట్టే ఉండేవి అంత అందంగా మాట్లాడేది..ఎవ్వరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వంకాదు ...జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన మనిషి కాబట్టి నాకు ఎప్పటికీ దూరం కాదు అని చాలా దైర్యంగా ఉండే వాడిని....మద్యిలో కొన్ని నిజాలు తాను చెప్పినప్పుడు ఆనిజం ఎందుకు అబద్ద కాకూడదు అని ఎన్ని సార్లు అనుకున్నానో...తెల్సిన కాన్నించి అస్సలు నిదుర పట్టేదికాదు...ఎవ్వరో తనను తనవద్దనుంది దూరంగా బలవంతంగా లాక్కెలుతున్నట్టూ ఉండేది కాని మాటల్లో నిజాయితీ అమె అంటే ఇంకా ఇష్టపడేలా చేసింది...అంత అద్బుతమైన స్నేహం తనది..అందుకే చాలా విషయాల్లొ తట్టుకోలేని భాద అనిపించినా తాను హేపీగా ఉండాలనే కాంప్రమైజ్ అయ్యాను ఎన్నో విషయాల్లో..అన్నీ అర్దం చేసుకుంటారండీ...అందుకే నచ్చారని అంటే చిన్నపిల్లాడీలా ఎంతో హేపీగా ఫీల్ అయ్యే వాడిని...దూరం అవుతావేమో అని మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామా అంటే ఎందుకలా చిన్నపిల్లాడిలా ఆలోచిస్తావు అని ...చిలిపిగా కొప్పడేది మామూలుగా ఎవ్వరిని బాదపెట్టే మాటలు అనదు అమె నైజంకాదు ..కాని అనుకోని పరిస్థితుల్లో ...నన్ను చాలా దారుణ మైన మాటలు అంది...తట్టుకోలేకపోయాను...ఎందుకలా అన్నావని అడుగలేను ఎందుకు మొదలైందో తెలీదు ఓ అడ్డుగోడ వచ్చినిలచింది మాఇద్దరి మద్యి...దూరం పెరుగుతూ వచ్చింది...తట్టుకోలేక పోయాను...నాగురించి ఎవ్వరు ఏంచెప్పినా నమ్మదు అని గట్టిగా అనుకునే వాన్ని ఎందుకు నమ్మిందో అన్నీ నమ్మింది..నన్ను దోషిని చేసింది ..ఈ క్రమంలో జరిగిన గొడవల్లో ఎన్నోసార్లు నేను భాదపడ్డా తను హేపీగా ఉండాలనే చూశా ...మాటలు కరువయ్యాయి...దూరం పెరిగింది...నాకు ఎప్పుడూస్వార్దం ఎక్కువ నాదీ అని ...నాది అనుకున్నది ఎవ్వరు మాట్లాడాకూడదు తలచుకోకూడాదనే స్వార్దం ఉండేది..ఏది వద్దు అనుకుంటున్నానీ అవేజరిగేవి...నాగురించి ఇంతగా తెల్సిన మనిషి...దూరం అయింది " ఓబుల్ రెడ్డి" మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాడు...బౌతికంగా చచ్చి బ్రతికిన వాడి లెక్కన....నేను చిన్న భాదపడినా తట్టుకోలేని మనిషి...నేను ఎంత భాదపడుతున్నా అని తెల్సినా మాటవరసకైనా పలుకరించకుండా ....దూరం అయింది...ఓబుల్ రెడ్డి బ్రతికి ఉన్నాడో లేదో అని కనీసం ఆలోచిస్తుందా అని అనిపిస్తుంది ఇప్పుడు ....ఎన్నో నిదుర లేని రాత్రుల్లు గడుపుతున్నా అని తెల్సికూడా ఎలా వున్నావని పలురింపులు కూడా లేవు ఓబుల్ రెడ్డి ఇంక బ్రతకడు అని తెల్సినా మౌనంగానే ఉంటుంది అంటే ...తనకి ఓబుల్ రెడ్డి బ్రతికి ఉండటం ఇష్టంలేదేమో అని...నిర్నంతీసుకున్నాడు ఆ నిర్నయం తనకి తెల్సేలా చేశాడు కాని మౌనంగానే ఉంది...గతం లో ఓసారి చెపితే కంగారు పడింది కాని ఇప్పుడూ ...ఎప్పుడు పోతాడాని ఎదురు చూస్తునంట్టుంది..అందుకే నా http://obulreddi.blogspot.com/ ను క్లోజ్ చేసినట్టుగానీ జీవితాన్ని ముంగిచాలని ఈ ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ కు త్వరలో ముగింపు పెట్టాలని నిర్నయించుకున్నా..ఇప్పటికే అన్ని వివరాలు తనకి తెల్పా తాను శాశ్వితంగా జీవితాన్ని చాలించే విషయం తనకు ఒక్కదానికే తెల్సేలా